
టాప్ హీరోయిన్స్‌ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేయడం, వాటికి తిరిగి కౌంటర్స్ ఇవ్వడం కామన్‌గా మారింది. అందులోనూ తాప్సీ లాంటి స్టార్ హీరోయిన్‌ను ఎవరైనా కామెంట్స్ చేస్తే ఆమె అస్సలు ఊరుకోదు. తిరిగి వెంటనే తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చేస్తుంది. ఇప్పటికే చాలాసార్లు ఆమెపై నెటిజన్స్ వేసిన కౌంటర్స్‌కు రీ కౌంటర్ ఇచ్చిపడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
కొన్నాళ్లుగా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే తాప్సీ నటిస్తూ మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై రీసెంట్‌గా జరిగిన చాట్‌లో తాప్సీ మూస పద్ధతిలోనే ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన తాప్సీ ‘ఇది మూస పద్ధతి, నా ప్రతి సినిమాలో ఒక బలమైన మహిళా పాత్ర ఉంటుంది. ఆమె తనకు తానుగా నిలబడుతోంది. నేను ఆ మూస పద్ధతిలో బాగానే ఉన్నాను. కొంతమంది క్రిటిక్స్‌ని సంతృప్తి పరచడానికి బలహీనమైన పాత్రలను పోషించడానికి నేను రెడీగా లేను. అందుకే ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోను’ అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. అసలు ఫిమేల్ ఓరియెంటెడ్ స్ర్కిప్ట్‌లే తాప్పీని ఓ రేంజ్‌లో నిలబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. డేరింగ్ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది.