తాజ్ మహల్ను చూడటానికి వెళ్తే కొట్టిర్రు...ఎందుకంటే..

తాజ్ మహల్ను చూడటానికి వెళ్తే కొట్టిర్రు...ఎందుకంటే..

ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానికులు  దాడి చేశారు.  వెంబడించి మరీ కొట్టారు.  కర్రలు, రాడ్‌లతో పర్యాటకుడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

విచక్షణా రహితంగా..

2 నిమిషాల 14 సెకన్ల వీడియోలో తాజ్ మహల్ను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కొందరు  యువకులు కర్రలతో దాడి చేశారు. స్వీట్ షాపులోకి వచ్చిన అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. టూరిస్టు బతిమిలాడుతున్నా...యువకులను సముదాయిస్తున్నా వినిపించుకోలేదు. ఇంతలో కొద్ది మంది ఈ ఘటనను చూసి స్వీట్ షాపులోకి వచ్చారు. యువకులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోకుండా దాడి చేస్తూనే ఉన్నారు. 

ఎందుకు దాడి చేశారంటే..

థానా తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయి చౌకీలో ఈ ఘటన జరిగింది. ఓ పర్యాటకుడు తాజ్ మహల్‌ను సందర్శించడానికి కారులో ఆగ్రాకు వచ్చాడు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో  ఓ శోభాయాత్ర జరుగుతోంది. టూరిస్ట్  కారు భక్తులలో ఒకరిని తాకింది. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు పర్యాటకుడిని కొట్టడం ప్రారంభించారు. పర్యాటకుడు తన తప్పుకు క్షమాపణలు కోరుతూనే ఉన్నాడు. అయినా భక్తులు వినలేదు. టూరిస్టు తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ స్వీట్ షాపులోకి పారిపోయాడు. అతన్ని వెంబడించిన కొందరు యువకులు కర్రలు, రాడ్లతో అక్కడికి చేరుకుని అతడిని కొట్టారు. 

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే.. థానా తాజ్‌గంజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశామని, దాడి చేసిన వారిలో  మరికొందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.