మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షారుఖ్

మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షారుఖ్

ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు లీవ్ తీసుకోవాలని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సూచించారు. మోడీ జన్మదినం సందర్భంగా షారుఖ్ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజల సంక్షేమం విషయంలో అంకితభావం ఉన్న మోడీ తన లక్ష్యాలు సాధించేందుకు అవసరమైన బలం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పుట్టిన రోజును ఆనందించడానికి ఒక రోజు సెలవు తీసుకోవాలని షారుఖ్ ప్రధానిని కోరారు. 

ప్రధాని మోడీ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో మోడీ జన్మించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జన్మదినం రోజున ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించారు. నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్‌లో ఆయన వదిలారు.