బీఆర్ఎస్​కు టీబీజీకేఎస్ గుడ్ బై

బీఆర్ఎస్​కు టీబీజీకేఎస్ గుడ్ బై
  •     గోదావరిఖనిలో జరిగిన స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో బీఆర్ఎస్​కు అనుబంధ సంఘంగా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆ పార్టీకి గుడ్​బై చెప్పింది. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వకుండా స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా యూనియన్ ను పునర్ నిర్మిస్తామని సంఘం నేతలు తీర్మానం చేశారు. శనివారం గోదావరిఖనిలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలకు చెందిన ముఖ్య నేతల స్టీరింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య ఇటీవల తమ పదవులకు రిజైన్ చేశారు. వారి రాజీనామాలను కూడా స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. ‘‘కార్మికుల హక్కుల సాధన కోసం యూనియన్ పోరాడుతున్నది. సంఘాన్ని నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదు. ఇక మీదట రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తాం’’అని తెలిపారు.