ఉద్యమకారులను  విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యమకారులను  విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
  •   సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

మహబూబాబాద్​​ అర్బన్​, వెలుగు: రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన అనేక మంది ఉద్యమకారులను,  ప్రజా సంఘాలను ఉద్యమ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం  స్థానిక వీర భవన్​లో  ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ    ఉద్యమకారులను ఉద్యమ సంస్థలను,  రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం ప్రాధాన్యం ఇవ్వాలని  డిమాండ్ చేశారు.

 తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని,    కార్మికుల సంఘాలను, విద్యార్థి, యువజన  సంఘాలను ఉద్యమంలో భాగస్వాములను చేశామన్నారు.  కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, లీడర్లు  బి అజయ్, తమ్మెర విశ్వేశ్వరరావు,   కట్టబోయిన శ్రీనివాస్,  పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి  పాల్గొన్నారు.