హైదరాబాద్:రాబోయే ఐదు రోజులు తెలంగాణ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రంలో ఉష్ట్రోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొం ది. ఆదివారం(ఏప్రిల్ 7) నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ మెట్ సెంటర్ వెల్లడించింది.
ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో సహా ఏప్రిల్ 9 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 10 న ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి,వికారాబాద్ లలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ కు వర్ష సూచన
మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్ గిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా్ల్లో బుధవారం( ఏప్రిల్ 10) వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో శనివారం (ఏప్రిల్ 06) గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ట్రోగ్రత నమోదు అయింది. ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడుతున్న తెలంగాణ ప్రజలు వర్షాలకోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణంలో ఆహ్లాదకర మార్పు.. తెలంగాణ వాసులకు ఊరట కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
