అన్నదానానికి అండగా ఉంటాం

 అన్నదానానికి అండగా ఉంటాం

హైదరాబాద్: లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేదలకు అన్నదానం చేసేందుకు ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ పేరుతో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ట్రక్కులను సికింద్రాబాద్ మారియట్ కన్వెన్షన్ దగ్గర ప్రారంభించారు. లయన్స్ క్లబ్ కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. రెండు కోట్లతో ఏర్పాటు చేసిన 20 ఫుడ్ ట్రక్స్ తో ట్విన్ సిటీస్ తో పాటు వరంగల్, కరీంనగర్ లో పేదలకు అన్నదానం చేస్తామన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు.

ఆ తర్వాత  రంజాన్ సందర్భంగా సనత్ నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్‌లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అన్నారు. అదేవిధంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్టలో మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం మంత్రి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.