హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగాయి: తలసాని

హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగాయి: తలసాని

పద్మారావునగర్​, వెలుగు: దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్ ఒక్కటేనని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం  బన్సీలాల్ పేట్ డివిజన్ లోని నెక్లెస్ ప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ టవర్స్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలన అందించే బీఆర్ఎస్​ సర్కారుకు మద్దతు ఇవ్వాలని కోరారు.  నెక్లెస్ ప్రైడ్ టవర్స్ అంటేనే ఒక మినీ ఇండియా లాంటిదని, వారికి ఎలాంటి సమస్య ఉన్నా తాను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.  

సనత్ నగర్ లోని సివిటాస్ అపార్ట్మెంట్ వాసులు, సాయిబాబా నగర్, పద్మారావు నగర్ లోని  పద్మనాభ రెసిడెన్సీ, సవరాల బస్తీ, బాపూజీనగర్ లలో  ఏర్పాటు చేసిన సమావేశాల్లో తలసాని పాల్గొన్నారు.  పద్మారావునగర్ పార్క్‌‌లో వాకర్స్ ను కలిసి ఓటు అభ్యర్ధించారు.  హమాలీబస్తీ వాసులు తలసానికే ఓటు వేస్తామని తీర్మానం చేశారు.  

ఈ నెల 30న ప్రతి ఒక్కరూ ఓటింగ్‌‌లో పాల్గొనాలని, కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన  కోరారు.  బీఆర్ఎస్​పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ కే. హేమలత, నాయకులు జి. పవన్ కుమార్ గౌడ్, ప్రేమ్ కుమార్, వెంకటరమణ, అరుణ్ గౌడ్, నెక్లెస్ ప్రైడ్ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.