భట్టికి తలసాని సవాల్.. హైదరాబాద్‌లో జాగ చూపిస్తే ఇండ్లు కట్టిస్తాం

భట్టికి తలసాని సవాల్.. హైదరాబాద్‌లో జాగ చూపిస్తే ఇండ్లు కట్టిస్తాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తలసాని మాట్లాడుతూ..హైదరాబాద్ లో స్థలాలు లేవు కాబట్టే..శివారు ప్రాంతంలో ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిపారు.

ఓట్ల కోసం ఇళ్లు కట్టియ్యడం లేదని, ఇళ్ల నిర్మాణం ఎప్పటి నుంచో ఉందని ప్రస్తావించారు. భట్టి విక్రమార్క హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల్ని చూపిస్తే..అక్కడే కట్టిస్తానన్న తలసాని..తాము కట్టిన ఇళ్లు చూపిస్తుంటే హైదరాబాద్ లో కట్టకుండా..హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎందుకు కట్టిస్తున్నారని భట్టి ప్రశ్నించారన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడాలనుకుంటే ఇక్కడ కాదు..కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకోవాలని సూచించారు. అవసరమైతే లక్ష డబుల్ బెడ్ ఇళ్ల లిస్ట్ పంపిస్తా చూసుకోండన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మీడియాకి అంత అత్యుత్సాహం ఎందుకు..? అని తలసాని ప్రశ్నించారు. ఇవి బిల్డింగ్ లు అనుకుంటున్నారా? మజాక్ అనుకుంటున్నారా..? అని మండిపడ్డారు.

ఎన్ని కోట్లు పెట్టి కట్టిస్తున్నామో మాకు తెలుసు..పేద వాళ్ళకు కట్టిన ఇళ్లు ఇవి..ఇందులో మేము ఉంటామా..? వ్యాఖ్యానించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం లాగా ఇల్లు కట్టాలంటే కుదరదు. 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇళ్లను చూసేందుకు తాను వస్తేనే భట్టివిక్రమార్క వస్తాననడం సరికాదన్నారు.  కొల్లూరులో  ఎకరం కోట్లు విలువ చేసే స్థలంలో పేదలకు కట్టిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ కట్టించిన చెత్త ఇళ్లు ఎవరూ తీసుకోవడం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లను కట్టిస్తుందన్నారు. బాధ్యత లేకుండా భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, మేం పారిపోతే …డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చూపించేందుకు  మిమ్మల్ని ఎలా తీసుకెళతామన్నారు.

భట్టి విక్రమార్క కు కళ్లు కనిపిస్తలేదు..హైదరాబాద్ లో 90శాతం, శివారు ప్రాంతంలో 10శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామన్న మంత్రి తలసాని..హైదరాబాద్ లో నీళ్లు ఎక్కడ నిలుస్తున్నాయో భట్టి విక్రమార్కకు చూపిస్తానంటూ..రాష్ట్రం కోసం మంత్రి కేటీఆర్ కష్టపడి పని చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు.