మహిళలకు వర్సిటీ విద్యపై తాలిబన్ల నిషేధం 

మహిళలకు వర్సిటీ విద్యపై తాలిబన్ల నిషేధం 

ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబన్లు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు. ఈమేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నెదా మహ్మద్​ నదీం ఆదేశాలు జారీ చేశారు. వాటిని కచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించారు. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజల హక్కులను గౌరవించేంత వరకు తాలిబన్ల ప్రభుత్వం అంతర్జాతీయ సమాజంలో గుర్తింపును పొందలేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ స్పష్టం చేశారు. 

మరెన్నో నిషేధాలు..

ఈ ఏడాది నవంబరులోనే మహిళలు పార్కులకు, ఫన్​ ఫెయిర్లకు, జిమ్​ లకు, పబ్లిక్​ బాత్​ లకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధం విధించారు. చాలా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కూడా మహిళల్ని తప్పించారు. చివరకు పురుషుడు తోడు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేయడంపైనా తాలిబన్లు నిషేధం విధించడం గమనార్హం.