
అఫ్ఘనిస్థాన్ లో పెళ్లిళ్లపై అక్కడి తాలిబన్ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళల బలవంతపు మ్యారేజ్ లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. మ్యారేజ్ కి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తాలిబన్ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పురుషులు, మహిళలు సమానమని.. మహిళను ఆస్తిగా చూడకూడదని ఉత్తర్వుల్లో తెలిపారు. భర్తను కోల్పోయిన మహిళ.. 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకోవచ్చని తాలిబన్లు తెలిపారు.