ప్రభుత్వ సిబ్బందికి క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు

V6 Velugu Posted on Aug 17, 2021

ఆఫ్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత.. తాజాగా ప్రభుత్వ సిబ్బందికి క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగులందరూ తమతమ విధులలోకి హాజరుకావాలని ఆదేశించారు. తమ నాయకులు అధికారం చేపట్టిన రెండు రోజుల్లో అందరూ విధులకు రావాలని కోరింది. అదేవిధంగా ప్రజలందరూ తమతమ పనులు యదావిధిగా చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. 

‘దేశంలోని ప్రతి ఒక్కరికి క్షమాభిక్ష పెడుతున్నాం. ఇక మీరందరూ పూర్తి విశ్వాసంతో మీ పనులు చేసుకోవచ్చు’ అని తాలిబన్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

Tagged Afghanistan, Talibans, amnesty, general amnesty, Afghan govt staff

Latest Videos

Subscribe Now

More News