ఇండో ఈయూ డీల్పై ముగిసిన చర్చలు..రూ. 6.41 లక్షల కోట్ల ఎగుమతులకు బూస్ట్.. 

ఇండో ఈయూ డీల్పై ముగిసిన చర్చలు..రూ. 6.41 లక్షల కోట్ల ఎగుమతులకు బూస్ట్.. 

న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఇటీవల జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్​టీఏ)పై చర్చలు మంగళవారం ముగిశాయి. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య టారిఫ్‌‌‌‌లను తగ్గించడమేగాక.. ఓపెన్ ట్రేడ్, రూల్స్ బేస్డ్ ట్రేడ్, ఇన్ క్లూజివ్ ట్రేడ్ నిబద్ధతను ప్రతిబింబించనుంది.

భారత్(ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ), ఈయూ(2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ) కలిసి ప్రపంచ జీడీపీలో  దాదాపు 25%, అలాగే.. ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ వస్తువులు ఈయూలో టారిఫ్ లేకుండా అమ్ముకోవచ్చు. దాంతో ఆ దేశానికి మన ఎగుమతులు పెరుగుతాయి.

భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో దాదాపు అన్నీ ఈయూలో టారిఫ్ ఫ్రీ లేదా తక్కువ టారిఫ్‌‌‌‌తో దిగుమతి అవుతాయి. ఇది మన దేశానికి ఎక్స్‌‌‌‌పోర్ట్ బూస్ట్‌‌‌‌ అనే చెప్పవచ్చు. ఎంతగా అంటే దాదాపు రూ.6.41 లక్షల కోట్లవిలువైన భారతీయ ఎగుమతులు ఈ ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందుతాయి. వీటిలో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్  నుంచే రూ.2.87 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు తక్షణమే ప్రయోజనం పొందనున్నాయి.

మహిళలు, యువత, చేతివృత్తులవారు, నిపుణులకు ఈ డీల్​తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. టీ, కాఫీ, మసాలాలు, పండ్లు, ప్రాసెస్‌‌‌‌డ్ ఫుడ్స్ ఎగుమతులు పెరిగి రైతులు, ఎక్స్‌‌‌‌పోర్టర్లకు మంచి ధరలు, మార్కెట్ అవకాశాలు కలగనున్నాయి.