తమన్నాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్​

తమన్నాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్​

నటుడు విజయ్​ వర్మతో రిలేషన్​లో ఉన్నానని చెప్పి తమన్నా అందరికీ షాకిచ్చింది. గతేడాది నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలేషన్​షిప్​పై ఓపెన్​ అయిన ఈ జంట తాజాగా మాల్దీవులకు టూర్​కి వెళ్లారు. ఈ టూర్​ నుంచి తిరిగి ఇండియా చేరుకున్న ఈ లవ్​ బర్డ్స్​ను తమన్నా ఫ్యాన్స్​ ఇబ్బంది పెట్టారు. ఆమె బయటకు రాగానే చుట్టుముట్టి ‘టూర్​ ఎలా ఉంది.. ఇద్దరూ బాగా ఎంజాయ్​ చేశారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

దీనికి కాస్త ఇబ్బంది పడ్డ తమన్నా సమాధానం చెప్పకుండానే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ వెనకే వస్తున్న విజయ్​ వర్మను కూడా ఫ్యాన్స్​ ఇలాంటి ప్రశ్నలే వేయడంతో అతను అసహనం వ్యక్తం చేశాడు. ‘మీరు ఇలాంటివి అడగడం బాగాలేదు’ అంటూ సీరియస్​గా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో నెట్టంట వైరల్​గా మారింది.