NBK 111: బాలయ్యతో మిల్కీ బ్యూటీ స్టెప్పులు.. గోపీచంద్ మలినేని ఊరమాస్ ట్రీట్!

NBK 111: బాలయ్యతో మిల్కీ బ్యూటీ స్టెప్పులు.. గోపీచంద్ మలినేని ఊరమాస్ ట్రీట్!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. వరుసగా 'వీర సింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుని మంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన 'అఖండ 2: తాండవం' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ జోష్‌లోనే బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 బాలయ్య 111లో తమన్నా ఐటమ్ సాంగ్..

బాలకృష్ణ కెరీర్‌లో 111వ ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ సినిమా గురించి అప్‌డేట్ ఏంటంటే.. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ ఊరమాస్ సాంగ్ లో బాలయ్య సరసన డ్యాన్స్ చేసేందుకు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. తమన్నాకు స్పెషల్ సాంగ్స్ కొత్తేమీ కాదు. గతంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో 'డాంగ్ డాంగ్' పాటతో పాటు అనేక సినిమాల్లో తన అందం, డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది. బాలయ్యకు, గోపీచంద్ మలినేనికి మాస్ ఎలిమెంట్స్‌పై మంచి పట్టు ఉండటంతో.. వీరి కాంబినేషన్‌లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కోసం త్వరలోనే ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారని సమాచారం..

వచ్చే నెలలో కొత్త షెడ్యూల్..

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగంగా జరుగుతోంది. వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లోనే తమన్నాతో స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వెంకట సతీశ్ కిలారు ఈ భారీ చిత్రాన్ని 'వృద్ధి సినిమాస్' పతాకంపై నిర్మిస్తున్నారు. బాలయ్య ఎంచుకునే పాత్రలు, గోపీచంద్ మలినేని టేకింగ్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

బాలీవుడ్‌లో తమన్నా బిజీ..

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా  ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన 'రేంజర్' అనే యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపే బాలయ్యతో కలిసి ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయడం ఖరారైతే, టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుంది. బాలకృష్ణ ఎనర్జీకి తమన్నా గ్లామర్, డ్యాన్స్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.