పెళ్లికి రెడీ అయిన విశాల్.. ఈ హీరోయిన్ గుర్తుందా..? వధువు ఈమెనేనని టాక్..!

పెళ్లికి రెడీ అయిన విశాల్.. ఈ హీరోయిన్ గుర్తుందా..? వధువు ఈమెనేనని టాక్..!

సినీ నటుడు విశాల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. విశాల్ 47 ఏళ్ల వయసులో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నాడని సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా వార్తలొచ్చాయి. వధువు మరెవరో కాదని.. సినీ ఇండస్ట్రీకే చెందిన సాయి ధన్సిక అని పుకార్లు షికారు చేస్తున్నాయి. విశాల్ సన్నిహితులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని ఒక జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. 

త్వరలోనే విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం జరగనుందని కూడా సదరు మీడియా సంస్థ చెప్పడం విశేషం. మీడియాతో ఇటీవల మాట్లాడిన సందర్భంలో విశాల్ కూడా తను ఒకరితో రిలేషన్లో ఉన్నట్లు చెప్పాడు. పెళ్లి గురించి ఇద్దరి మధ్య మాటలు నడుస్తున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని విశాల్ మీడియాతో పంచుకున్న విషయాలు విశాల్ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

వధువు ఎవరనే విషయం, పెళ్లి ఎప్పుడనే విషయాలను అతి త్వరలోనే చెబుతానని విశాల్ మీడియాకు చెప్పడం గమనార్హం. నాలుగు నెలల్లో విశాల్, సాయి ధన్సిక పెళ్లి ఉండొచ్చని, నిశ్చితార్థం మాత్రం త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ‘రజినీకాంత్’ కబాలి సినిమా చూసినవాళ్లకు సాయి ధన్సిక తెలిసే ఉంటుంది. ‘కబాలి’ సినిమాలో రజినీ కూతురి పాత్రలో ఆమె నటించింది. 

తెలుగులో ‘షికారు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ సినిమాల్లో నటించింది. ఇక.. విశాల్ విషయానికొస్తే.. అనీషా అల్లారెడ్డితో ఏప్రిల్ 2019న నిశ్చితార్థం జరిగింది. కారణం విషయంలో స్పష్టత లేదు గానీ నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే విశాల్, అనీషా పెళ్లి ప్లాన్ను రద్దు చేసుకున్నారు. 

ALSO READ | Vishal: విజయ్ సేతుపతితో విశాల్.. నిమిషాలపాటే మాట్లాడుకున్నా అదెంతో బాగుంది