Vishal: విజయ్ సేతుపతితో విశాల్.. నిమిషాలపాటే మాట్లాడుకున్నా అదెంతో బాగుంది

Vishal: విజయ్ సేతుపతితో విశాల్.. నిమిషాలపాటే మాట్లాడుకున్నా అదెంతో బాగుంది

విజయ్ సేతుపతితో తాను కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ విశాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని విశాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అభి మానులతో పంచుకున్నాడు.

'నా ఫ్రెండ్ విజయ్ సేతుపతిని చాలాకాలం తర్వాత చెన్నై ఎయిర్ పోర్టులో కలిశా. అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే. కొన్ని నిమిషాలపాటే మేం మాట్లాడుకున్నా అదెంతో బాగుంది' అని విశాల్ పోస్టులో తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే విజయ్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన విశాల్.. ఆ నటుడిని త్వరలోనే మరోసారి కలవాలని ఆకాంక్షించారు.

కాగా... ఇటీవల తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలో నిర్వహించిన అందాల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్.. వేదికపైనే స్పృహ తప్పి పడి పోయిన సంగతి తెలిసిందే. 

ALSO READ | Suriya46: లక్కీ భాస్కర్ డైరెక్టర్తో సూర్య సినిమా స్టార్ట్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

తెలుగు, తమిళ భాషల్లో విశాల్, విజయ్ సేతుపతిలకు వీపరితమైన ఫ్యాన్ ఫాల్లోవింగ్ సంపాదించుకున్నారు. ఈ హీరోలు ఏం చేసిన ఇట్టే తెగ వైరల్ చేస్తుంటారు వీరి ఫ్యాన్స్. కానీ, ఈ మధ్య ఈ హీరోలే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయారు.

అదేలా అంటే.. వరుస డిజాస్టర్స్తో స్ట్రగుల్లో ఉన్న పూరి జగన్నాథ్తో విజయ్ సడెన్గా సినిమా ప్రకటించాడు. బెగ్గర్ అనే టైటిల్తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

అయితే, ఈ కాంబో ఎవరు ఊహించనిది. దాంతో ఒక్కసారిగా సినీ సర్కిల్ లో టాక్ మొదలైంది. సేతుపతి నటించిన ‘ఏస్‌’మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. ఇక విశాల్ తన హెల్త్ ఇష్యుపై నెటిజన్లలలో ఎప్పుడు ఏదో సందేహం రేకేత్తిస్తున్నాడు.