Suriya46: లక్కీ భాస్కర్ డైరెక్టర్తో సూర్య సినిమా స్టార్ట్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Suriya46: లక్కీ భాస్కర్ డైరెక్టర్తో సూర్య సినిమా స్టార్ట్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

దర్శకుడు వెంకీ అట్లూరి-హీరో సూర్య ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చేసింది. నేడు సోమవారం (మే19న) ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందంతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఫోటోలు పంచుకుంటూ వివరాలు వెల్లడించారు. ‘సూర్య46 అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది! వెంకీ అట్లూరి, సూర్య ఇద్దరు వెండితెరపై మ్యాజిక్ సృష్టించడానికి ఏకమయ్యారు. ఈ ప్రయాణాన్ని మొదటి క్లాప్‌తో అలంకరించి ప్రారంభించినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు’అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ తెలిపింది.

ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ మూవీస్ రూపొందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సూర్య నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ధనుష్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే ఈ మూవీ మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 2026 సమ్మర్ లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. సూర్యకి జోడిగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటిస్తోంది.  

సూర్య కొత్త తెలుగు సినిమాలు:

కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సూర్య..  డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆయనకున్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలనుందని చెప్పాడు.

కొన్ని ప్రయత్నాలు జరుగగా ఏదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాత్రం వరుసగా తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు సూర్య. చందూ మొండేటితోనూ సూర్య స్టోరీ డిస్కస్ చేశాడట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ఓ చిత్రంతో పాటు, ఆర్జే బాలాజీ దర్శకత్వంలోనూ సూర్య ఓ సినిమా చేస్తున్నాడు.