
తమిళనాడు సినీ ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. కొందరు స్టార్లు తమ సినిమాల కోసం రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ అడిగితే ఇవ్వడం లేదంటూ హీరోలపై నిర్మాతలు మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి పిచ్చి కథలతో వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అంటూ సదరు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. ఇందులో భాగంగా హీరో శింబు(Shimbu), దర్శకుడు ఎస్‌జే సూర్య(SJ Surya), నటుడు అధర్వ మురళి(Adarva Murali), హీరో విశాల్(Vishal), కమెడియన్ యోగి బాబు(YogiBabu)తో సహా ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.