తమిళనాడు సీఎం విజయ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. నెట్టింట ఫోటోలు వైరల్!

తమిళనాడు సీఎం విజయ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. నెట్టింట ఫోటోలు వైరల్!

CM Vijay vs Kohli: భారతీయ సినిమా, రాజకీయాలు, క్రికెట్ కలయికతో కూడిన ఒక అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇటీవల తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 'దళపతి' విజయ్ (Thalapathy Vijay) కి రన్ మెషీన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు. MRF సంస్థకు చెందిన టాప్ అఫీషియల్స్ ద్వారా విరాట్ కోహ్లీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన (సంతకం చేసిన) ఒక ప్రత్యేకమైన బ్యాట్‌ను సీఎం విజయ్‌కు చెన్నైలో అందించారు. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 (Qualifier 1) మ్యాచ్‌కు ముందు ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

క్లాసిక్ లుక్‌లో దళపతి: 
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ ఫొటోల్లో.. విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్‌ను అందుకుంటూ సీఎం విజయ్ ఎంతో సంతోషంగా కనిపించారు. సాంప్రదాయక తెల్లటి షర్ట్, వెష్టి (ధోతీ)పైన బ్లాక్ కోట్ ధరించిన విజయ్ క్లాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా రంగాన్ని వీడి, రాజకీయాల్లోకి వచ్చి, తమిళనాడు సీఎంగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్‌ను అభినందిస్తూ కోహ్లీ ఈ ప్రత్యేక బహుమతిని పంపినట్లు సమాచారం. 

క్రికెట్‌తో 'సీఎం విజయ్‌కు ప్రత్యేక బంధం:
ఈ వైరల్ మూమెంట్ కేవలం ఒక గిఫ్ట్ ఇవ్వడంతోనే ఆగలేదు, విజయ్‌కు క్రికెట్‌తో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ వ్యవహరించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో విజయ్‌కు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ధోనీ తర్వాత విరాట్ కోహ్లీతో కూడా విజయ్‌కు సంబంధించిన ఈ కనెక్షన్ బయటకు రావడంతో ఇరు వర్గాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ALSO READ : పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే..

మే 26న ధర్మశాలలో క్వాలిఫైయర్-1: 
ఒకవైపు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం తన పూర్తి ఫోకస్‌ను ఐపీఎల్ ప్లేఆఫ్స్‌పైనే పెట్టాడు. మే 26 (మంగళవారం)న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియం వేదికగా జరగబోయే క్వాలిఫైయర్-1 మ్యాచ్ కోసం ఆర్‌సీబీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ బిగ్ ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.