Team India: భారత మహిళల క్రికెట్ జట్టు (Team India Women) మరో మెగా సమరానికి రెడీ అయింది. వచ్చే (జూన్ 12న) నెలలో జరగనున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC Women’s T20 World Cup)లో పాల్గొనడంతో పాటు ఇంగ్లాండ్ పర్యటన కోసం హర్మన్‌ప్రీత్ సేన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (UK)కి పయనమైంది. కాగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్:
మెగా టోర్నీకి పక్కాగా సిద్ధమవ్వడం కోసం భారత్– ఇంగ్లాండ్ జట్లు మే 28 నుంచి జూన్ 2 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. ఆ తర్వాత జూన్ 6 నుంచి వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ తన వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా కార్డిఫ్‌లో వెస్టిండీస్‌తో, డెర్బీలో ఇంగ్లాండ్‌తో పోటీ పడనున్నాయి.
పాకిస్తాన్‌తోనే భారత్ ఫస్ట్ మ్యాచ్:
మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్‌లో భారత్ 'గ్రూప్–బీ' లో ఉంది. ఈ గ్రూప్‌లో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.
ALSO READ : పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే..
టీమిండియా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్:
* జూన్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (టోర్నీ ప్రారంభం)
* జూన్ 17న టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ (లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియం)
* జూన్ 21న టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా (మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్)
* జూన్ 25న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ (మాంచెస్టర్)
* జూన్ 28న టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం)
టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, భారతి ఫుల్మాలి, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నందిని శర్మ, రాధా యాదవ్.
