మార్కెట్ అంతా అల్లకల్లోలంగా ఉంది.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుంటే.. బంగారం ధర తగ్గింది. వెండి ధరల్లో మార్పు లేకుండా అలాగే ఉంది. ఎప్పుడు ధర పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని విధంగా ఉంది మార్కెట్ సిట్యువేషన్.. 2026, మే 23వ తేదీ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దాదాపుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. భారతదేశంలో పన్నుల పెంపు తర్వాత రేట్లు పెరిగినప్పటికీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారాంతంలో గోల్డ్ తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది షాపింగ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
మే23న బంగారం రేట్లు తగ్గాయి. మే 22 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.43 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 906గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 580గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 23, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు మారకుండా రూ.2లక్షల 95వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.295 దగ్గర ఉంది.
