
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం. ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 9,69,047 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందు వల్లే జనవరి నుంచి ఏప్రిల్ వరకు డేటా ఉచితంగా ఇస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. తమిళనాడులోని విద్యార్థులకు తమిళనాడు ఎలక్రానిక్స్ కార్పొరేషన్ ద్వారా డేటా కార్డులు పంపిణీ చేస్తామన్నారు.ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఉచిత డేటాను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు జారీ చేస్తోంది.