తమిళనాడులో డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో తొలి మరణం

తమిళనాడులో డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో తొలి మరణం

కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వైరస్‌తో తమిళనాడులో మొదటి మరణం సంభవించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఎంఎ సుబ్రమణియన్‌ శనివారం ప్రకటించారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నమూనాలను సేకరించి పరీక్షించగా.. అందులో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వైరస్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు.రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌ సోకిన వారిలో చెన్నైకి చెందిన ఓ నర్సు, కాంచీపురం జిల్లాకు చెందిన మరొకరు కోలుకున్నట్లు తెలిపారు సుబ్రమణియన్‌. 

దేశంలో ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తం కేసుల్లో మహారాష్ట్రలో 22, తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు చొప్పున, ఏపీ, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు డెల్టా ప్లస్‌ వైరస్‌ సోకి మృతి చెందారు.