
తెలంగాణ ఎన్నికలకు తమిళ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లేఖ రాశారు. ఎన్నికల భద్రతా విధులు చేపట్టేందుకు 5 వేల మంది పోలీసులను పంపించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో తమిళనాడు హోం డీజీపీ వన్నియపెరుమాళ్ అన్ని జిల్లాల ఎస్పీలకు సర్క్యులర్ పంపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పోలీసులను పంపాలని సూచించారు. నవంబర్ 27వ తేదీకి తెలంగాణకు పంపాలని తమిళనాడు డీజీపీ సర్కులర్ లో పేర్కొన్నారు.