వరద బాధితులకు గవర్నర్ నిత్యావసర సరుకుల పంపిణీ

వరద బాధితులకు గవర్నర్ నిత్యావసర సరుకుల పంపిణీ

హైదరాబాద్: 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని  రాష్ట్ర గవర్నర్ తమిళి సై కోరారు. మంగళవారం ఆమె వరద బాధితులకు బట్టలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు గవర్నర్‌ తెలిపారు.  హర్ ఘర్ తిరంగలో భాగంగా రాజ్ భవన్ లోని శానిటరీ గార్డెన్ కార్మికులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. 

దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు.  దేశభక్తికి చిహ్నంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రజలను కోరారు. మంగళవారం ఆమె వరద బాధితులకు బట్టలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.  ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు గవర్నర్‌ తెలిపారు.