బాధితుడికి చికిత్స చేసిన గవర్నర్ తమిళి సై

బాధితుడికి చికిత్స చేసిన గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇటీవలే విమానంలో తీవ్ర అస్వస్ధతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించిన తమిళిసై పై ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తికి చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

పుదుచ్చేరి నుంచి చెన్నైకి గవర్నర్ తమిళి సై వస్తున్నారు. ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్గు ప్రమాదంలో గాయపడ్డాడు. దీనిని చూసిన ఆమె.. వెంటనే కాన్వాయ్ ను ఆపారు. బాధితుడి వద్దకు వెళ్లి రక్తస్రావం కాకుండా కట్టు కట్టారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆసుపత్రిలో చేరిపించేందుకు చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్ లో ఆస్పత్రికి పంపించిన అనంతరం బాధితుడికి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేస్తే వారి ప్రాణాలు నిలబడుతాయని గవర్నర్ తమిళి సై పోస్టులో పేర్కొన్నారు.