పెండ్లైన రెండో రోజునుంచే వరకట్న వేధింపులు..

పెండ్లైన రెండో రోజునుంచే వరకట్న వేధింపులు..

అధిక కట్నం కోసం భర్త పెట్టే టార్చర్ ను భరించలేని యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తమిళనాడులోని దర్మపురి జిల్లా, కదిర్ నాయకన్ హల్లి లో జరిగింది. కొంతకాలం క్రితం మణిమొళి అనే యువతికి సెంగావి అనే యువకునికి పెండ్లి జరిగింది. వివాహం అయిన రెండో రోజునుంచే అధిక కట్నం కోసం మణిమొళిని వేధించడం మొదలు పెట్టాడు భర్త సెంగావి. దీంతో తల్లిదండ్రుల వద్ద నుంచి రెండు లక్షల నగదును, ఐదు సవర్ల బంగారాన్ని తెచ్చి ఇచ్చింది మణిమొళి. అయినా అధిక కట్నంపై ఆశ చావని సెంగావి, అతని తల్లిదంఢ్రులు మళ్లీ మణిమొళిని వేధించసాగారు. దీంతో అత్తింటి వేధింపులు తట్టుకోలేని మణిమొళి భర్తను వదలి తన పుట్టింటికి వచ్చేసింది. అక్కడే ఉంటూ B-Ed  పూర్తి చేసింది. ఆపై MSc కి అప్లైయ్ చేసుకుంది.

భార్య పైచదువులకు అప్లైచేసుకున్న విషయం తెలుసుకున్న సెంగావి… మనిమొళి ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో మనిమొళి  తల్లి తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో భర్త సెంగావిపై మణిమొళి కంబైనల్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న సెంగావి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనిమొళిని కొట్టాడు.. ఆపై చంపెతానని బెధిరించాడు.  దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మనిమొళి విషం తాగుతూ  వీడియో తీసుకుంది. అందులో తన చావుకు కారణం తన భర్త సెంగావి, అతని తల్లిదండ్రులేనని చెప్పింది.

తన బాధలను వివరిస్తూ మూడు పేజీల లెటర్ లను కూడా వెంటపెట్టుకుంది మణిమొళి. తన భర్త, అతని కుటుంబసభ్యులు అధిక కట్నం కోసం తనను తన తల్లిదండ్రులను చంపడానికి చూస్తున్నారని… పోలీసులు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. అతనికి రాష్ట్ర మంత్రి సపోర్ట్ ఉందని ఆ వీడియోలో చెప్పింది. విషం తాగి పడిఉన్న మణిమొళిని స్థానికులు గమనించి హాస్పిట్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతుంది. మణిమొళి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వీడియో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం పై పోలీసులపై ప్రజలు ఫైర్ అవుతున్నారు.