రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్

రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్

ప్రపంచ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో  సిరీస్ లో తొలి మ్యాచ్  తర్వాత అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకున్నట్లుగా ఇక్బాల్ ప్రకటించాడు.  తాను రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు.   తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును కోరాడు.

ఇక్బాల్ ఇప్పటికే టీ20 క్రికెట్ నుండి గత సంవత్సరం రిటైర్ అయ్యాడు . బంగ్లాదేశ్  తరుపున ఓపెనర్ గా ఇక్బాల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. తన క్రికెట్ లో 25 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేలకు  పైగా పరుగులు సాధించాడు.

 ఇక్బాల్ గతేడాది ఐర్లాండ్ తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.  34 ఏళ్ల తమీమ్‌ తన 16 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు.  రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమీమ్ ఇక్బాల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడితో తన కెరీర్ ముగిసిందని.. ఇప్పటివరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని.. తనకు అండగా నిలిచిన బీసీబీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో తమీమ్‌ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.