వీరభద్రంకు గుండెపోటు.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

వీరభద్రంకు గుండెపోటు.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో  కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.

అనంతరం ఖమ్మం ఆస్పత్రి డాక్టర్ల సూచన మేరకుహైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్​కు తరలించారు. మరోవైపు ఆయన హెల్త్​నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.