ఇవాళ ట్యాంక్​బండ్​ బంద్

ఇవాళ ట్యాంక్​బండ్​ బంద్
  • ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నో ఎంట్రీ

హైదరాబాద్​, వెలుగు: ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్​బండ్​’ నేపథ్యంలో ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్​ ట్యాంక్​బండ్​ను మూసేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్​ అదనపు సీపీ అనిల్​ కుమార్​ నోటిఫికేషన్​ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు, ఆందోళనకారులు ట్యాంక్​బండ్​, పరిసర ప్రాంతాల్లో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉండడంతోనే అక్కడికి వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ రోడ్డుగుండా వెళ్లే వాళ్లు వేరే రూట్లలో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్​ మళ్లింపు

  • సికింద్రాబాద్​ నుంచి ట్యాంక్​బండ్​ వైపు వచ్చే వాహనాలు: కర్బాలా మైదానం, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్​రోడ్స్​, సీజీఓ టవర్స్​, ముషీరాబాద్​ క్రాస్​ రోడ్స్​ మీదుగా..
  • ఆర్టీసీ క్రాస్​రోడ్​ నుంచి ఇందిరా పార్క్​ వైప:- అశోక్​నగర్​ క్రాస్​రోడ్స్​ మీదుగా..
  • తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనా లు:  ఇక్బాల్​ మినార్, రవీంద్ర భారతి వైపుకు మళ్లింపు
  • ఇక్బాల్​ మినార్​ నుంచి సికింద్రాబాద్​ వైపు: తెలుగు తల్లి ఫ్లై ఓవర్​ లెఫ్ట్​ తీసుకుని నెక్టెస్​ రోటరీ, నెక్లెస్​ రోడ్​ మీదుగా వెళ్లాలి.
  • హిమాయత్​నగర్​ ‘వై’ జంక్షన్​ నుంచి వచ్చే వాహనాలు:-  లిబర్టీ జంక్షన్​ వద్ద లెఫ్ట్​ తీసుకుని బషీర్​బాగ్​ వైపు వెళ్లాలి.
  • ఓల్డ్​ ఎమ్మెల్యే క్వార్టర్స్​ నుంచి వచ్చే ట్రాఫిక్​: బషీర్​బాగ్​ నుంచి పీసీఆర్​ జంక్షన్​, బీజేఆర్​ విగ్రహం మీదుగా వెళ్లాలి.
  • ఎస్​బీహెచ్​ గన్​ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు: బీజేఆర్​ విగ్రహం నుంచి కేఎల్​కే బిల్డింగ్​ వైపు మళ్లింపు
  • ఖైరతాబాద్​ ఫ్లై ఓవర్​ నుంచి: నెక్లెస్​ రోటరీ వద్ద మింట్​ కాంపౌండ్​ లేన్​ వైపు వెళ్లాలి