
గణపతి నిమజ్జనాలకు సర్వం సిద్ధం అయ్యింది. గణేష్ ఉత్సవాలలో తొమ్మిదవ రోజు కావడంతో.. ట్యాంక్ బండ్ కు భారీ సంఖ్యలో నిమజ్జనానికి గణపయ్యలు తరలిరానున్నాయి. నిమజ్జనాల కోసం జీఎహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద భారీ క్రెయిన్ లను ఏర్పాటు చేశారు అధికారులు.
నిమజ్జనం సందర్బంగా పోలీసుల భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో నిమజ్జనం కోసం 30 వేల మంది పోలీసులు బందోబస్త్ కల్పించనున్నారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించనున్నారు పోలీసులు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారు.
నిమజ్జనం కోసం సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ వద్ద మొదలైన నిమజ్జనం సందడి మొదలైంది. పీపుల్స్ ప్లాజా, ఎన్. టి. ఆర్ ఘాట్ వద్ద గణపతి నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది.
ఈ రూల్స్ పాటించాల్సిందే: రాచకొండ సీపీ...
గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పోలీసులు కమిషనరేట్ నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి పోలీసు అధికారులు బందోబస్తు కు వచ్చారని తెలపారు. నిమజ్జనాల భద్రత కోసం ప్రత్యేక బలగాలను కూడా వాడుతున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా బాలాపూర్ గణేష్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లడ్డూకి ఫేమస్ అయిన బాలాపూర్ గణనాథుని ఇప్పటికే లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారని.. వేలం పాట రోజు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సరూర్ నగ్ మినీ ట్యాంక్ బండ్ పై కూడా నిమజ్జనం కు గణేష్ విగ్రహాలు వస్తున్నాయని చెప్పారు. చెరువు వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 59 పై చిలుకు చెరువులు ఉన్నాయని.. చెరువుల వద్ద తొంగి చూడకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్ల మరమ్మతు, విద్యుత్ వైర్లు, పెద్ద పెద్ద చెట్లు తొలిగిస్తున్నామని తెలిపారు.
నిమజ్జనం సక్రమంగా సాగేందుకు హైద్రాబాద్ పోలీసులతో కలిసి పని చేస్తామని తెలిపారు సీపీ. అన్ని చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ వాటర్ ఉన్నందున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తమకు సహకరించాలని కోరారు.
డీజే లపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఇది నిర్వహకులు గుర్తుంచుకోవాలని కోరారు. డీజేపలపై 100 కు కాల్స్ చేసి కంప్లైట్ చేస్తున్నారని.. నిర్వహకులు డీజేలను వినియోగించకూడదని సూచించారు. గత సంవత్సరంతో పోలిస్తే 9వ రోజు ఎక్కువ గణేష్ నిమజ్జనాలు జరుగుతాయని చెప్పిన సీపీ.. అందుకోసం TGSP స్పెషల్ పోలీస్ సిబ్బందిని వాడుతున్నట్లు తెలిపారు. అనుమానితులను గుర్తించడం కోసం SOT , షీటీమ్స్ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.