Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ టైటిల్ రేస్ ఫేవరెట్లు వీరే.. తేల్చిచెప్పిన సాయి శ్రీనివాస్!

 Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ టైటిల్ రేస్ ఫేవరెట్లు వీరే.. తేల్చిచెప్పిన సాయి శ్రీనివాస్!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ అనే ఊహించని ట్విస్ట్‌తో హౌస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంటిపై బెంగతో రాము రాథోడ్ స్వయంగా వైదొలగగా, ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తూ వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు రావడంతో సాయికి గుడ్‌బై చెప్పక తప్పలేదు. అయితే, కేవలం నాలుగు వారాలే హౌస్‌లో ఉన్న సాయికి ఎలిమినేషన్‌కు కారణాలేంటి, అతడి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో చూద్దాం... 

సాయి ఎలిమినేషన్‌కు రీజన్ ఇదే..

సాయి శ్రీనివాస్ నటుడిగా పరిచయం ఉన్నప్పటికీ, బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన ముద్ర వేయడంలో వెనుకబడ్డాడు. అతడి ఎలిమినేషన్‌కు దారితీసిన అనేక ముఖ్య కారణాలు ఉన్నాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ఇమ్యూనిటీ పవర్ అందుకున్నప్పటికీ, దాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. టాస్కుల్లో చురుకుగా పాల్గొన్నా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కంటెంట్ ఇవ్వలేకపోయాడు. హౌస్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఒకరి మాటలు మరొకరికి చెప్పడం వలన, తోటి కంటెస్టెంట్స్ దృష్టిలో మానిప్యులేటర్‌ అనే నెగెటివ్ ఇమేజ్ పడింది. ఇది ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది.

వీక్ గేమ్ ప్లే..

 కెప్టెన్సీ గేమ్‌లు, ఫిజికల్ టాస్కుల్లో పూర్తి స్థాయిలో తన సత్తా చాటలేకపోయాడు సాయి శ్రీనివాస్. ఆటలో ముందు వరసలో నిలబడటానికి బదులు, వెనుకబడటం వలన అతని గేమ్ కనిపించలేదు. దివ్య, రీతూ వంటి కంటెస్టెంట్లు తెలివిగా అతడిని ఆట నుంచి తప్పించారు. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం సాయి ధైర్యానికి నిదర్శనమైనా, తనూజ ఫ్యాన్స్ ఓట్లను చీల్చే సాహసం చేయడం అతడికి మైనస్‌గా మారింది. నాగార్జున కూడా సాయిని సేవ్ చేసేందుకు తనూజకు గోల్డెన్ బజర్ ఉపయోగించే అవకాశం ఇచ్చారు. కానీ ఆమె ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడటం వలన సాయి ఎలిమినేషన్ తప్పలేదు.

 రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సాయి శ్రీనివాస్ కేవలం నాలుగు వారాలు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన నటుడిగా, అతడికి వారానికి రూ.2 లక్షల వరకు పారితోషికం అందినట్లు సమాచారం. ఈ లెక్కన, హౌస్‌లో ఉన్న నాలుగు వారాలకుగానూ సాయి శ్రీనివాస్ సుమారు రూ.8 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ట్రోఫీ రేస్‌లో తనూజ, ఇమ్మాన్యుయేల్‌.

ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జునతో మాట్లాడిన సాయి శ్రీనివాస్, హౌస్‌మేట్స్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ట్రోఫీ రేస్‌లో బలమైన పోటీదారులుగా తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను పేర్కొన్నాడు. రైట్ ప్లేయర్స్ గా ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సుమన్ శెట్టిలను ఎంచుకున్నాడు. గేమ్ మెరుగుపరుచుకోవాలని రాంగ్ ప్లేయర్స్ కేటగిరీలో భరణి, రీతూ, దివ్యలను ఉంచి సలహా ఇచ్చాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో హౌస్‌లో చాలా మంది కట్టప్పలు ఉన్నారని, ముఖ్యంగా రీతూ చౌదరి తనను వెన్నుపోటు పొడిచిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ సీజన్ 9 ఫైనల్ రేస్ మరింత రసవత్తరంగా మారింది. మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ రేసులో ఉన్నారో చూడాలి..