ఒర్లీన్స్ (ఫ్రాన్స్): ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తన్వీ 21-–14, 21–-14 తేడాతో వరుస గేమ్స్‌లో ఆరో సీడ్ నట్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది. కేవలం 43 నిమిషాల్లోనే తన్వీ ఈ మ్యాచ్‌ను ముగించడం విశేషం.
బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో రెండోసారి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉన్న తన్వీ సెమీస్‌లో ఐదో సీడ్, ఒలింపిక్ కాంస్య పతక విజేత నొజోమి ఒకుహరా (జపాన్)తో తలపడనుంది. మరోవైపు మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్ –ఎంఆర్ అర్జున్ జోడీ 12–21, 20–22తో మూడో సీడ్ లియో కర్నాండో–బగాస్ మలౌనా (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడి నిరాశపరిచింది.
