టాంజానియాలో ధర్మరావుపేటవాసి మృతి

టాంజానియాలో ధర్మరావుపేటవాసి మృతి

నర్సంపేట, వెలుగు: టాంజానియాలో తేనెటీగల దాడిలో వరంగల్​ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారావుపేట గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మచారి(55) హోటల్​మేనేజ్​మెంట్​కోర్సు చేసి ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం కెన్యా దేశానికి వెళ్లాడు. కరోనా టైంలో జాబ్​పోయింది. దీంతో కెన్యా పక్క దేశమైన టాంజానియాకు వెళ్లి వ్యవసాయం చేసేందుకు వీలుగా వంద ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడేళ్లుగా అక్కడే వ్యవసాయం చేస్తున్నాడు.

గత ఏడాది ఆగస్టు నెలలో ధర్మారావుపేట వచ్చి పెద్దకూతురు పెళ్లి చేసి వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం అక్కడ పొలంలో ఫోన్​ మాట్లాడుతుండగా బ్రహ్మచారితో పాటు మరికొందరిపై తేనెటీగలు దాడి చేశాయి. ముఖం, కండ్లపై విపరీతంగా కుట్టడంతో స్పాట్​లోనే బ్రహ్మచారి చనిపోయాడు. ఈ సమాచారాన్ని అక్కడే  ఉంటున్న చిన్న కూతురు శ్రావికకు అక్కడి ఆఫీసర్లు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్​లో ఉంటున్న పెద్దకూతురు, అల్లుడు మంగళవారం టాంజానియాకు వెళ్లారు. మూడు రోజుల తర్వాత డెడ్​బాడీ వచ్చే చాన్స్​ఉందని బ్రహ్మచారి సోదరుడు జలేంద్రచారి చెప్పారు.