నందమూరి తారకరత్న పెద్ద కర్మ మార్చి 2 న జరగనుంది. ఫిలీంనగర్ లోని కల్చరల్ సెంటర్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు పెద్ద కర్మకు సంబంధించి కార్డ్ ప్రింట్ చేయించారు. ఈ కార్డ్ పై తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, వారి పిల్లల పేర్లతో పాటు.. వెల్ విషర్స్ గా నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్లు ఉన్నాయి.
జనవరి 27న తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అంత్యక్రియలు అయ్యే పూర్తయ్యే వరకు బాలకృష్ణ అన్నీ తానై చూసుకున్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తారకరత్నకు బంధువు. తారకరత్న భార్య ఆలేఖ్య, విజయసాయిరెడ్డి భార్య వాళ్ల చెల్లెలి కూతురు అన్న సంగతి తెలిసిందే.
