
ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా చూడడమే లక్ష్యమన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యువత సెల్‌ఫోన్లకు బానిస కాకుండా కూడా చూడాలనేది ఆశయమన్నారు. మహిళల ఫిర్యాదులు పరిష్కరించడంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారన్నారు. షీటీమ్, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి మహిళల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు, సంతోషకరమైన జీవితానికి హైదరాబాద్ కేరాఫ్ అని.., ఈజ్ ఆఫ్ లివింగ్, మహిళలకు రక్షణ అంశాల్లో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి ర్యాంక్ దక్కిందన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి .