మా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త..ఇండియాపై అమెరికా అక్కసు

మా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త..ఇండియాపై అమెరికా అక్కసు
  • ఇండియాపై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ అక్కసు

వాషింగ్టన్: అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఇండియా, బ్రెజిల్ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్‌‌‌‌‌‌‌‌ లుట్నిక్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. 

అమెరికాలో తమ ఉత్పత్తులను అమ్ముకోవాలనుకుంటే.. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. బ్రెజిల్, ఇండియా తమ మార్కెట్లను తెరిచి.. అమెరికాకు నష్టం చేకూరుస్తామంటే కుదరదని తెలిపారు. స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలను అమెరికా మరింత సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అక్కసు వెళ్లగక్కాడు. 

అమెరికాను ఇబ్బందిపెట్టే పాలసీలన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశాడు. ఓ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్లు చేశారు. అమెరికాకు సహకరిస్తేనే.. ఆయా దేశాలకు ట్రంప్ హెల్ప్ చేస్తారని చెప్పారు. 

మొండిగా వ్యవహరిస్తే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపాలని ట్రంప్ చెప్తున్నా ఇండియా పట్టించుకోవడం లేదన్నారు.

 ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టాకే ఇండియా రాయితీపై రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎవరివైపు ఉండాలనే విషయంపై మోదీ 
ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.