తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం ట్రైజర్ రిలీజ్

తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం ట్రైజర్ రిలీజ్

తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో   కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మిక్స్ చేస్తూ సోమవారం   ట్రైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘కొంతమందికి  అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. నా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌లో కూడా చాలామంది ఉన్నారు.  కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి.

 దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి. నిజంగా అదొక ప్రపంచం. ఇలాంటి కథతో యూనిక్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో కశ్యప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.  ధియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాఫ్ రైడ్ ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రం చాలా ఫన్నీగా ఉంటుందని, ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ డైరెక్టర్ కశ్యప్ థ్యాంక్స్ చెప్పాడు. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు  మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇదని నిర్మాతలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కథా రచయిత సూర్య ప్రకాష్ జోస్యుల,  సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ,  ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విప్లవ్‌‌‌‌‌‌‌‌ నిషాదం,  కాస్ట్యూమ్ డిజైనర్ అపూర్వ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.