- దాంతో ఉపయోగం లేదు.. ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఓటమిపాలైంది: తరుణ్‌చుగ్
- అందుకే ఆ పార్టీ నేత అధ్యక్ష బాధ్యతలు తీసుకోవట్లే
హైదరాబాద్, వెలుగు: ‘‘కాంగ్రెస్ పార్టీ కాలంచెల్లిన ఇంజక్షన్, దానితో ఎలాంటి ప్రయోజనం లేదు” అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో ఆ పార్టీ మూడు సార్లు ఓటమి పాలైందన్నారు. నేడు కాంగ్రెస్‌లో నీతి లేదు, నేతలు లేరు, నెట్ వర్క్ కూడా లేదన్నారు. దేశంలో ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయంటే ఒక ఏడాది ముందు సమాలోచనలు జరుపుతుందని, ఇదే తరహాలో ఈసారి కూడా చేస్తోందన్నారు. కాలంచెల్లిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి కూడా వెనుకాడుతున్నాడని అన్నారు. కార్యకర్తలు కూడా ఆ నేతపై విశ్వాసం లేని స్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఆ పార్టీ 2023 జనరల్ ఎలక్షన్ ప్రజల విశ్వాసం ఎలా పొందుతుందని ప్రశ్నించారు.
టెర్రరిస్టులు కాశ్మీర్ ప్రజలకు శత్రువులు
టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, టూరిజంను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. వారు కాశ్మీర్ ప్రజలకు శత్రువులని అన్నారు. ప్రధాని మోడీ కాశ్మీర్ ప్రజల వికాసమే కాదు చరిత్ర తిరగరాస్తున్నాడని చెప్పారు. అందుకే కాశ్మీర్‌లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇప్పుడు కాశ్మీర్‌లో బోట్ నుంచి రిసార్ట్ వరకు ఒక్కటి కూడా ఖాళీ లేకుండా కిక్కిరిసి పోతున్నాయని చెప్పారు. అక్కడ పేదరికం తగ్గుతోందని తరుణ్‌చుగ్
వివరించారు.
