అక్రమంగా జింక కొమ్ముల విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

అక్రమంగా జింక కొమ్ముల విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  జింక  కొమ్ములను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెండు జింక కొమ్ములను స్వాధీనం చేసుకుని నిందితులను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. శోభన్ బాబు, నాగచారి అనే ఇద్దరు స్నేహితులు జింక కొమ్ములను సూరారంలో ఓ వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని బోయిన్ పల్లి మార్కెట్ సమీపంలో అరెస్టు చేసి జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అడ్డ దారిలో ఇలాంటి పనులు చేస్తున్నారని, నిందితులను అరెస్టు చేసి అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.