సికింద్రాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో దారుణం వెలుగుచూసింది. చికెన్ విక్రయదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్ళిన, వారం, పది రోజుల నుంచి నెల వరకు నిల్వ ఉన్న చికెన్ను అమ్ముతున్న వ్యక్తితో పాటు 15 మందిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుళ్లిన మాంసం అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, మున్సిపల్ హెల్త్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ కుళ్లిన చికెన్ను జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్తో పాటు చిన్న చిన్న ఫుడ్ కోర్టులకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.
ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ చికెన్ సెంటర్స్ నుంచి వేస్టేజ్ చికెన్ను సేకరించి, పాడైన చికెన్ను కిలో 30 నుంచి 50 రూపాయల చొప్పున వైన్స్లో పర్మిట్ రూమ్స్కు, జనతా బార్స్కు, కల్లు కాంపౌడ్స్కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్స్కు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. గతంలో కంటోన్మెంట్, రసూల్ పురలో ఇతనే సేమ్ చికెన్ విక్రయిస్తున్నట్లు స్థానికుల ఫిర్యాదు చేయగా, అక్కడ దుకాణం బంద్ చేసి బేగంపేట ప్రకాష్ నగర్లో బాలయ్య చికెన్ సెంటర్ పేరిట దుకాణం తెరిచాడు.
ALSO READ | కొంపదీసి కొండాపూర్ శరత్ సిటీ మాల్లోని చట్నీస్, అల్ఫాహార్ టిఫిన్స్లో తింటున్నారా..?