తెలంగాణ హైవేలపై టాటా ఈవీ చార్జర్లు

తెలంగాణ హైవేలపై టాటా ఈవీ చార్జర్లు

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల ప్రధాన హైవేలలో  టాటా 14 ఈవీ మ్యాన్డ్​ మెగాచార్జర్లను ప్రారంభించింది. ఇందుకోసం టాటా ఈవీ వోల్ట్రాన్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) చార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం ముఖ్య లక్ష్యం. 

మాన్డ్ మెగాచార్జర్లు అంటే చార్జింగ్ స్టేషన్‌‌లలో వినియోగదారులకు సహాయం చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీటివల్ల రెండు రాష్ట్రాలలో ఈవీల వాడకం పెరుగుతుందని,  సుదీర్ఘ ప్రయాణాలలో చార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని టాటా తెలిపింది. హైవేలపై ఉన్న కీలక ప్రదేశాలలో చార్జర్లను ఏర్పాటు చేశామని పేర్కొంది.