త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్..విస్ట్రోన్ ప్లాంట్ టాటా హస్తగతం

త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్..విస్ట్రోన్ ప్లాంట్ టాటా హస్తగతం

భారత్లో ఐఫోన్ 15 తయారీ ప్లాంట్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ చివరి నాటికి టాటా గ్రూప్ విస్ట్రోన్ ఐఫోన్ ప్లాంట్‌ను టేకోవర్ చేయవచ్చని తెలుస్తోంది.  బెంగళూరులోని ప్లాంట్ ను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకున్న  తర్వాత..ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు తయారు కానున్నాయి. 

ఉద్యోగాల తొలగింపు..

విస్ట్రోన్ ఐఫోన్ ప్లాంట్‌ను తీసుకోబోతున్న టాటా గ్రూప్...ఇప్పటికే సైట్‌లో సంస్థాగత సర్దుబాట్లు చేయడం ప్రారంభించింది. విస్ట్రోన్ టేకోవర్‌లో భాగంగా ఫ్యాక్టరీలోని దాదాపు 2000 మంది కార్మికులను తొలగించాలని భావిస్తోంది. మరో 400 మంది మధ్య స్థాయి సిబ్బంది కూడా ప్లాంట్‌ను వదిలి వెళ్లే అవకాశం  కనిపిస్తోంది. దీనికి తోడు నలుగురైదుగురు సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు నిష్క్రమించే ప్రక్రియలో ఉన్నారు. 

భారతదేశంలో ఆపిల్ ఫోన్లను ఉత్పత్తి చేసే ఏకైక యూనిట్ బెంగళూరులోని విస్ట్రోన్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ద్వారా రానున్న రోజుల్లో  దేశంలో ఫోన్ల రంగంలో సుమారు $600 మిలియన్ల లాభాలను అర్జించాలని  ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు.. చైనా నుండి ఐఫోన్ల తయారీని బదిలీ చేయాలన్న మరో ఉద్దేశంతో బెంగుళూరులో ఫ్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఐఫోన్ల తయారీలో అమెరికా, చైనా మధ్య పోటీ నెలకొంది. అయితే  కాలిఫోర్నియాకు చెందిన ఐఫోన్ యూనిట్...ప్రపంచ ఐఫోన్ ల ఉత్పత్తిలో సుమారు 25% భారతదేశానికి తరలించాలని భావించింది.