మారథాన్‌‌లో ఏడుగురికి గుండెపోటు.. ఒకరు మృతి

మారథాన్‌‌లో ఏడుగురికి గుండెపోటు.. ఒకరు మృతి
  • ఏడుగురు హాస్పిటల్‌‌లో చేరిక..
  • ఒక సీనియర్‌‌ సిటిజన్‌‌ మృతి

ముంబయి: ఏటా వేలమంది పాల్గొనే టాటా ముంబయి మారథాన్‌‌లో విషాదం చోటుచేసుకుంది. పార్టిసిపెంట్స్‌‌లో ఏడుగురికి గుండెపోటు రాగా… గజానన్‌‌ మల్‌‌జల్‌‌కర్‌‌(64 ) అనే వ్యక్తి హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతూ చనిపోయారు. 17వ టాటా ముంబయి  మారథాన్‌‌ను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌‌లో భాగంగా డ్రీమ్‌‌రన్‌‌, హాఫ్‌‌ మారథాన్‌‌ వంటి పలు రకాల ఈవెంట్లు నిర్వహిస్తారు. డ్రీమ్‌‌ రన్‌‌ ఈవెంట్‌‌లో పాల్గొన్న గజానన్‌‌ నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాక గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నిర్వాహకులు వెంటనే అతన్ని హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్ పొందుతూ మృతిచెందాడు. గజానన్‌‌ 2018లో డ్రీమ్‌‌ రన్‌‌ ఈవెంట్‌‌లో పాల్గొన్ని సర్టిఫికెట్‌‌, మెడల్‌‌ అందుకున్నారు.  5.9 కిలోమీటర్ల డ్రీమ్‌‌ రన్‌‌ ఈవెంట్‌‌లో ఎక్కువ మంది పాల్గొంటుంటారు. ఈ రన్‌‌కు టైమ్‌‌ లిమిట్‌‌ అంటూ ఏదీ ఉండదు. సక్సెస్‌‌ ఫుల్‌‌గా పూర్తి చేసిన ప్రతిఒక్కరికి సర్టిఫికెట్‌‌తోపాటు మెడల్‌‌ ప్రజెంట్‌‌ చేస్తారు. మారథాన్‌‌ కార్యక్రమానికి టైగర్‌‌ ష్రాఫ్‌‌, మిలింద్‌‌ సోమన్‌‌, రాహుల్‌‌ బోస్‌‌, లిరిక్‌‌ రైటర్‌‌ గుల్జార్‌‌ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అన్ని ఈవెంట్లలో కలిపి మొత్తం 55వేల మంది పాల్గొన్నారు.

see more news 

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

ప్లానింగ్​ ఇట్ల కూడా : లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లను త్వరగా తీర్చడం

ఇక ఒక బాటిలేనా? : డ్యూటీ ఫ్రీ ఆల్కాహాల్‌‌ పై పరిమితులు