కలిసొచ్చిన పండగ సీజన్.. అక్టోబర్లో భారత కార్ల అమ్మకాల జోరు: టాప్ లో టాటా నెక్సాన్..

కలిసొచ్చిన పండగ సీజన్.. అక్టోబర్లో భారత కార్ల అమ్మకాల జోరు: టాప్ లో టాటా నెక్సాన్..

ఈ ఏడాది 2025 అక్టోబర్‌లో ఆటోమొబైల్ మార్కెట్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాల జోరు కొనసాగింది. పండగ సీజన్, ప్రజల్లో కొనుగోలు చేయాలనే సానుకూల భావన దీనికి ముఖ్య కారణం. సెప్టెంబర్ చివరిలో జీఎస్టీ (GST) రేటు తగ్గించడం కూడా ఆటో కంపెనీల అమ్మకాలను మరింత పెంచింది. ఇందులో జీఎస్టీ తగ్గింపు చిన్న కార్ల విభాగానికి చాలా సహాయపడింది, అయితే చిన్న ఎస్‌యూవీ (సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ)లకు డిమాండ్ అలాగే కొనసాగింది.

అక్టోబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే :  

1. టాటా నెక్సాన్  అక్టోబర్ 2025 అమ్మకాలు 22,083 గత ఏడాది ఇదే నెలలో 14,759, దింతో సేల్స్ 50% పెరిగాయి. 
2. మారుతి సుజుకి డిజైర్ అక్టోబర్ 2025 అమ్మకాలు 20,791 గత ఏడాది ఇదే నెలలో 12,698 దింతో సేల్స్ 64% పెరిగాయి. 
3. మారుతి సుజుకి ఎర్టిగా    అక్టోబర్ 2025 అమ్మకాలు 20,087 గత ఏడాది ఇదే నెలలో 18,785 దింతో సేల్స్ 7% పెరిగాయి. 
4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అక్టోబర్ 2025 అమ్మకాలు  18,970 గత ఏడాది ఇదే నెలలో  13,922 దింతో సేల్స్ 36% పెరిగాయి. 
5. హ్యుందాయ్ క్రెటా (N లైన్ + EV కలిపి) అక్టోబర్ 2025 అమ్మకాలు 18,381 గత ఏడాది ఇదే నెలలో  17,497 దింతో సేల్స్  5% పెరిగాయి. 
6. మహీంద్రా స్కార్పియో (క్లాసిక్ + N కలిపి) అక్టోబర్ 2025 అమ్మకాలు 17,880 గత ఏడాది ఇదే నెలలో  15,677, దింతో సేల్స్ 14%  పెరిగాయి. 
7. మారుతి సుజుకి ఫ్రాంక్స్ అక్టోబర్ 2025 అమ్మకాలు 17,003 గత ఏడాది ఇదే నెలలో 16,419  దింతో సేల్స్ 4% పెరిగాయి. 
8. మారుతి సుజుకి బాలెనో అక్టోబర్ 2025 అమ్మకాలు 16,873 గత ఏడాది ఇదే నెలలో  16,082 దింతో సేల్స్ 5% పెరిగాయి. 
9. టాటా పంచ్ (ICE + EV కలిపి) అక్టోబర్ 2025 అమ్మకాలు 16,810 గత ఏడాది ఇదే నెలలో  15,740 దింతో సేల్స్  7% పెరిగాయి
10. మారుతి సుజుకి స్విఫ్ట్    అక్టోబర్ 2025 అమ్మకాలు 15,542 గత ఏడాది ఇదే నెలలో  17,539 దింతో సేల్స్ -11% తగ్గాయి. 

టాటా నెక్సాన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఎస్‌యూవీ 22,083 సేల్స్  గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 50% పెరిగింది.  మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 20,791 అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచి, 64% భారీ వృద్ధిని నమోదు చేసింది. దీనికి కారణం మంచి సేఫ్టీ  రేటింగ్, జీఎస్టీ తగ్గింపుతో పాటు వచ్చిన కొత్త మోడల్.

మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ విభాగంలో టాప్) 20,087 అమ్మకాలతో 7% వృద్ధి చెంది మూడో స్థానంలో ఉంది, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 18,970 అమ్మకాలతో నాలుగో స్థానంలో  36% వృద్ధిని చూపించింది. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్ వంటి ఎస్‌యూవీలు/క్రాస్‌ఓవర్‌లు కేవలం సింగిల్ డిజిట్  వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.

హ్యుందాయ్ క్రెటా 5% వృద్ధితో 18,381 అమ్మకాలను చూపింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 4% వృద్ధితో 17,003  అమ్మకాలు జరగ్గా... టాటా పంచ్ 7% వృద్ధితో 16,810 అమ్మకాలను నమోదు చేసింది. ఇక మారుతి సుజుకి స్విఫ్ట్ 10వ స్థానంలో నిలిచి అమ్మకాలు 11% క్షిణించింది. జీఎస్టీ తగ్గింపు ఉన్న కూడా అమ్మకాలు తగ్గిన ఏకైక కారు ఇదే.