
Jaguar Land Rover: జీఎస్టీ తగ్గింపులతో కొత్త కారు కొనేటోళ్లకు వేలల్లో కాదు లక్షల్లో ఆదా అవుతోంది. ప్రభుత్వం తెచ్చిన స్లాబ్ రేట్ల మార్పుల వల్ల తగ్గే పన్నును కస్టమర్లకు పాసాన్ చేయాలని కంపెనీలు చూస్తున్నాయి. దీంతో వరుసగా ఒకదాని తర్వాత మరొకటి తగ్గింపుల గురించి ప్రకటిస్తున్నాయి.
తాజాగా టాటాలకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ కూడా తగ్గించబడిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా తమ వివిధ మోడల్ లగ్జరీ కార్ల రేట్లలో భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. భారత ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలు లగ్జరీ కార్ల రేట్లను తగ్గించటానికి దోహదపడటంపై జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో భారత్ పన్నుల తగ్గింపు ప్రకటించిందని ఆయన అన్నారు.
ALSO READ : iPhone 17లో ఏ ఫీచర్స్ మారాయి..
ముందుగా రేంజ్ రోవర్ కార్ల ధర ఫీచర్స్ ఆధారంగా రూ.4లక్షల60వేల నుంచి గరిష్ఠంగా రూ.30లక్షల 40 వేలు తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. ఇక డిఫెండర్ కార్ల రేటు రూ.7 లక్షల నుంచి అత్యధికంగా రూ.18లక్షల 60వేలు తగ్గుతుంది. ఇక చివరిగా జేఎల్ఆర్ డిస్కవర్ కార్ల రేటును కనీసం రూ.4లక్షల 50వేల నుంచి గరిష్ఠంగా రూ.9లక్షల 90వేల వరకు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.