iPhone 17లో ఏ ఫీచర్స్ మారాయి.. కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటీ చూద్దామా..!

iPhone 17లో ఏ ఫీచర్స్ మారాయి.. కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటీ చూద్దామా..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చేసింది. అయితే ఈసారి మాత్రం ఎప్పటిలాగే కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ కొన్ని పాత ఫీచర్స్ కి గుడ్ బై చెప్పింది. కానీ ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో A19 చిప్, పెద్ద బ్యాటరీ, ప్రో-మోషన్ డిస్ ప్లే వంటి చాల లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఫీచర్లు,  అప్‌గ్రేడ్‌లతో పాటు ఆపిల్ పాత ఐఫోన్‌లో గత కొన్నేళ్లుగా ఉన్న ఫీచర్లను ఇప్పుడు తొలగించింది. మీరు కూడా లేటెస్ట్ ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ కావాలని  ప్లాన్ చేస్తే... మీరు మిస్ అయ్యే  కొన్ని ఫీచర్స్ ఇవే.... 

1.  ఐఫోన్ ప్లస్ మోడల్: చాలా ఏళ్లుగా ఆపిల్ ప్లస్ మోడల్ వేరియంట్‌ను మిడ్-టైర్ బిగ్-స్క్రీన్ అప్షన్ గా అందిస్తోంది. కానీ ఐఫోన్ 17 లాంచ్‌తో ఆపిల్ దానిని కొత్త ఐఫోన్ ఎయిర్‌తో మార్చేసింది. అంటే ప్లస్ వేరియంట్ మోడల్ కోసం చూసేవారికి ఈసారి కనిపించదు. 

2. సిమ్‌ కార్డుకు గుడ్ బై: ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ మోడళ్లలో e-SIM ఫీచర్ మాత్రమే తీసుకువచ్చింది, అంటే SIM స్లాట్‌ ఉండదు.   భారతదేశంలో ఇప్పటికీ డ్యూయల్ సిమ్ సపోర్ట్ (నానో సిమ్ + e-SIM) ఉన్నప్పటికీ,  కొత్త ఐఫోన్ మోడళ్లలో SIM మార్చుకునే అవకాశం ఉండదు. 

3. కలర్ వేరియంట్లు: పాత జనరేషన్ ఐఫోన్‌లు అంటే  పాత  మోడళ్ల నుండి 16 సిరీస్ వరకు పోలిస్తే ఐఫోన్ 17 స్టాండర్డ్ వేరియంట్లు  కొన్ని కలర్స్ లోనే లభిస్తుంది. 

4.  ఛార్జింగ్ కేబుల్ : ఇప్పుడు వచ్చే ఐఫోన్ 17 బాక్స్‌లో ఛార్జింగ్ కేబుల్ ఉండదు. అంటే ఆపిల్ కొత్త ఐఫోన్ వాడే వాళ్ళు విడిగా ఛార్జర్ కొనాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలోని చాలా మంది కస్టమర్లను నిరాశపరిచే విషయం. 

5. సింగిల్ కెమెరా: ఆపిల్ కొత్త ఐఫోన్ ఎయిర్ ఇప్పటివరకు వచ్చిన అన్నిటికంటే అత్యంత సన్నని ఐఫోన్, కానీ  కెమెరా హార్డ్‌వేర్‌ విషయంలో పాత ప్లస్ మోడళ్లలో ఉన్న డ్యూయల్-కెమెరా సెటప్‌ కాకుండా సింగిల్ 48MP బ్యాక్ కెమెరా ఇచ్చింది. ఫోటోగ్రఫీ   ఇష్టపడే వారికి ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.

మొత్తంగా చూస్తే ఐఫోన్ 17 సిరీస్ పవర్ ఫుల్  & ఫ్యూచర్ రెడీగా ఉంటుంది, కానీ కొన్ని ఫీచర్స్ విషయంలో  రాజీ పడక  తప్పదు. మీరు ప్లస్ మోడల్, మల్టి కలర్  అప్షన్స్  లేదా డ్యూయల్-కెమెరా ఫ్లెక్సిబిలిటీని ఇష్టపడితే, మీరు వాటిని ఈసారి మిస్ అయినట్టే. అయితే స్లిమ్ డిజైన్, పవర్ ఫుల్ అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ చిప్‌లు, AI ఫీచర్స్ పై ఆపిల్ దృష్టి పెట్టడం వల్ల చాలా మందికి అప్‌గ్రేడ్ కావాలని అనిపించొచ్చు.