
2023లో జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో నియమాలు పాటించలేదని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసొసియేషన్ గురువారెడ్డి. హెచ్ సీఏ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సీఏ కమిటీ మెంబర్లు క్రైమ్స్ చేస్తున్నారని విమర్శించారు. తాము హెచ్ సీఏ జోలికి వెళ్లలేదన్నారు. 2018 రిపోర్టే ఫ్రాడ్ అని ఈ ఫ్రాడ్ వెనుక ఎవున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు మిస్ యూజ్ చేశారు కాబట్టే సీఐడీ విచారణ జరుపుతోందన్నారు గురువా రెడ్డి. హెచ్ సీఏ స్కాంలో కేటీఆర్, కవిత ప్రమేయం ఉందని ఆరోపించారు. పదేళ్లుగా తెలంగాణలోని క్రికెట్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికే కవిత,కేటీఆర్ పై సీఐడీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసొసియేషన్.
కొనసాగుతోన్న సీఐడీ విచారణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగిన అవకతవకలపై జగన్‌మోహన్‌రావును సీఐడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస రావు, సీఈవో సునీల్ కాంటెలను విచారిస్తున్నారు. గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌గా మార్చడంతో పాటు గౌలిపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ సంతకం ఫోర్జరీపై జగన్‌మోహన్‌రావును సీఐడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్‌ను కూడా రెడ్ హిల్స్‌లోని సీఐడీ ఆఫీసులో విచారించారు. సంతకాలు ఫోర్జరీ చేసేందుకు ఎవరు ప్రలోభ పెట్టారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు
రూ. 170 కోట్ల ఫ్రాడ్
HCA గతంలో ఉన్నట్లు లేదని అలా ఉండుంటే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఒక క్రికెటర్ బయటికి వచ్చేవాడని ఇటీవలే గురువారెడ్డి అన్నారు. HCAలో ఇప్పటిదాకా సుమారు రూ. 170 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందని అన్నారు. HCA లో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా అవినీతి జరుగుతుందని అన్నారు. బీసీసీఐ ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లకు వరకు ఇస్తుందని.. ఐపిఎల్ నిర్వహణకు HCA కు నిధులు వస్తాయని అన్నారు. విజిలెన్స్ వారు ఎంక్వారీ చేయడం.. తర్వాత సీఐడీ ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని అన్నారు. ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం డాక్యుమెంట్లు సృష్టించడం అంత బయటపడిందని అన్నారు.
జగన్ మోహన్ అనర్హుడని.. ఈసీ అతన్ని ఎలా పోటీ చేయించారని ప్రశ్నించారు గురవారెడ్డి. క్లబ్ లో ఉన్నవారు ఎందుకు సహకరించారని అన్నారు. బీసీసీఐ ఇచ్చే గ్రాంట్ గ్రౌండ్ ల అభివృద్ధి కి ,క్రీడాకారులకు ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వర రావు చెప్పి వివరాల ప్రకారం అంతకముందు నేర చరిత్ర ఉన్నవాళ్ళని కూడా విచారించాలని అన్నారు గురువా రెడ్డి.