టీసీఎస్​..జాబ్​ చేయడానికి బెస్ట్ ..  తరువాతి స్థానాల్లో అమెజాన్​, మోర్గాన్​ స్టాన్లీ

టీసీఎస్​..జాబ్​ చేయడానికి బెస్ట్ ..  తరువాతి స్థానాల్లో అమెజాన్​, మోర్గాన్​ స్టాన్లీ

 

న్యూఢిల్లీ: మనదేశంలో ఉద్యోగులకు బెస్ట్​ వర్క్​ప్లేస్​గా టీసీఎస్​ నిలిచింది. తరువాత స్థానాల్లో అమెరికన్​ కంపెనీలు అమెజాన్​, మోర్గాన్​ స్టాన్లీ ఉన్నాయి. ఇండియాలో ఉద్యోగం చేయడానికి అత్యంత అనువైన 25 కంపెనీల లిస్టును సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ ​లింక్డ్​​ఇన్​ రూపొందించింది. గ్రోత్​కు, స్కిల్స్​కు, స్టెబిలిటీకి ఉన్న అవకాశాలు, జెండర్​  డైవర్సిటీ, ఎడ్యుకేషన్​ క్వాలిఫికేషన్, ఇండియాలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఇది కంపెనీలకు  ర్యాంకులు కేటాయించింది. ఈ ఏడాది లిస్టులో ఆర్థిక సేవలు, క్రూడాయిల్​ & గ్యాస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, తయారీ,  గేమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంపెనీలు ఎక్కువగా ఉండగా కిందటి ఏడాది టెక్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇన్ తన నివేదికలో పేర్కొంది.  

మొత్తం- 25 కంపెనీల్లో 10 కంపెనీలు ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినవి. వీటిలో మాకరీ గ్రూప్ (5),  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ (11), మాస్టర్ కార్డ్ (12),  యూబీ (ఇది వరకు క్రెడ్​ ఎవెన్యూ) (14) ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ–స్పోర్ట్స్  గేమింగ్ నుండి డ్రీమ్​11, గేమ్స్​ 24x7 వంటి కంపెనీలు జాబితాలోకి వచ్చాయి. లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇన్  టాప్ స్టార్టప్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న జెప్టో ఈ జాబితాలో కూడా 16వ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. 25 కంపెనీలలో  కొత్తగా17 కంపెనీలు ఈ జాబితాలోకి ప్రవేశించాయని లింక్డ్ఇన్ తెలిపింది. 

ఈ స్కిల్స్​కు ఎక్కువ డిమాండ్​

టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీలు కేండిడేట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ టెస్టింగ్,  కంప్యూటర్ సెక్యూరిటీ వంటి స్కిల్స్​ కోసం వెతుకుతున్నాయి. ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, కంపెనీలు కమర్షియల్​ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,  గ్రోత్ స్ట్రాటజీలలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం చూస్తున్నాయి.   ఇంజినీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, బిజినెస్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, సేల్స్, డిజైన్, ఫైనాన్స్,  ఆపరేషనల్‌‌‌‌‌‌‌‌ జాబ్​ ఫంక్షన్స్​ కోసం పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. టాప్​ కంపెనీలు ట్యాలెంట్​కోసం ఎక్కువగా వెతుకుతున్న నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో ఉంది.  తర్వాత స్థానాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ  పుణే ఉన్నాయి. 

‘‘ప్రస్తుతం పరిస్థితులు కొంత గందరగోళంగా ఉన్నాయి. ఏ కంపెనీలో చేరితే గ్రోత్ బాగుంటుందనే విషయమై ప్రొఫెషనల్స్​  విపరీతంగా ఎంక్వైరీ  చేస్తున్నారు. లాంగ్​ టర్మ్​ సక్సెస్​ ఇచ్చే కంపెనీలు కూడా తమకు ముఖ్యమని చెబుతున్నారు’’ అని లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇన్ కెరీర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీర్  ఇండియా ఎండీ నీరాజితా బెనర్జీ చెప్పారు.